ఈ గార్లిక్ క్రషర్లు మీ ఇంట్లో ఉన్నాయా? వీటితో పని భలే సులువు..!

-

వంటిళ్లు ఇప్పుడు ఒక మాయాప్రపంచం అయిపోయింది. అన్ని సౌకర్యాలు ఉన్న వంటిళ్లును మన అమ్మమ్మలు చూస్తే వారికి అది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటి వంటపాత్రలు, ఎలక్ట్రానికి పరికరాలు వచ్చేశాయి. రోట్లో చేతులు అరిగేలా రుబ్బిన బామ్మలు ఇప్పుడు గ్రైండర్లు, మిక్సీలు, చిన్నచిన్నవాటికి అయితే మిని జార్లు అబ్బో.. కత్తిపీటతో కూరగాయలు కోసిన చేతులకు ఇప్పుడు కట్టర్స్, ఏ షేప్ లో ఏ యాంగిల్లో అయినా, ఎంత చిన్నగా సన్నాగా అయినా అలా ప్రస్ చేస్తే చాలు తరిగేస్తాయి. అయితే మీకు వెల్లుల్లి తురిమే గ్యాడ్జెట్లు గురించి తెలుసా. దీంతో మీరు వెల్లుల్ని సన్నగా అయినా, చిన్నగాఅయినా, పేస్ట్ లెక్క అయినా చేసుకోవచ్చు. గార్లిక్ క్రషింగ్ గ్యాడ్జెట్లేంటో తెలుసుకొని మన వంటింట్లో వాటిని వెల్కమ్ చెప్పేద్దాం.

గార్లిక్ డైసర్ చాపర్

నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే పైన చెప్పుకుంది సరిపోతుంది. కానీ కొన్ని ఎక్కువ రెబ్బల్ని తురమాలంటే ‘గార్లిక్ డైసర్ చాపర్’ అందుకు చక్కటి ఎంపిక. ఇది పూస చేసుకునే గొట్టం లేదా మెషీన్‌లా ఉంటుంది. కింది భాగంలో ఒక పొడవాటి గొట్టం దానికి కింద రంధ్రాలుండే ప్లేట్ ఉంటుంది. ఈ గొట్టంలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి.. రొటేషన్ హ్యాండిల్‌లా ఉండే మూత బిగించి హ్యాండిల్‌తో తిప్పుతుండాలి. ఇలా చేయడం వల్ల హ్యాండిల్‌కు అడుగున ఉండే ప్లేట్ కిందికి జరుగుతూ వెల్లుల్లిని క్రష్ చేస్తుంది. ఇది కింద ఉండే రంధ్రాల ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఎంతో ఈజీగా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా లేదంటే పేస్ట్‌లా చేసేయొచ్చు.

గార్లిక్ ప్రెస్

కూరల్లో వెల్లుల్లి వేయాలంటే..మిక్సిలో వేయటం కుదరదు. లోడ్ ఎక్కువలేకపోతే అది తిరగనంటుంది. అందుకే మన కూరల్లో వేసుకొనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తురిమే పనిని మరింత సులభం చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంది ‘గార్లిక్ ప్రెస్’.లైమ్ స్క్వీజర్‌లా ఉండే ఈ ప్రెస్‌కి రెండు హ్యాండిల్స్ ఉంటాయి. మధ్యలో ఉండే ప్రెసర్‌కి పైన ఉండే ప్లేట్‌పై పదునుగా ఉండే రంధ్రాల్లాంటి బ్లేడ్స్ ఉన్నాయి.. కింది భాగంలో చిన్న బౌల్ ఉండి దానికి కింద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇప్పుడు ఇందులో పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బల్ని ఉంచి.. ప్రెస్ చేయడం వల్ల ఆ తురుము రంధ్రాల్లోంచి కిందికి వస్తుంది. దాన్ని కూరల్లో వేసేసుకుంటే పని సులువవుతుంది.

ప్రెస్ రొటేట్ గార్లిక్ క్రషర్

మీరు ప్రస్తుతం ఇలానే వాడుతుండోచ్చు. ఒక రాయితోనే రాడ్ తోనే వెల్లుల్ని క్రష్ చేసి కూరల్లో వేస్తారు. సరిగ్గా అలానే పనిచేస్తుంది ఈ పరికరం. మినీ గిర్నీలా ఉండే ఈ క్రషర్‌కి ఓవైపు వెల్లుల్లి రెబ్బలు వేసుకునే వీలుంటుంది. మరోవైపు పైన రొటేటర్ ఉండి.. దానికి కింద లోపలి వైపు పదునైన బ్లేడ్స్ ఉంటాయి. ఈ రొటేటర్‌ని తిప్పుతున్న క్రమంలో వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటిగా ఆ బ్లేడ్స్‌తో క్రష్ అవుతూ కింద ఉండే రంధ్రాల నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేస్తూ, హ్యాండిల్‌ని తిప్పుతూ చాలా సులభంగా వెల్లుల్లి పేస్ట్‌ని తయారుచేసుకోవచ్చు. చేతికి అనువుగా, భలే బాగుంటుంది ఇది.

మినీ గార్లిక్ క్రషర్

మినీ గార్లిక్ క్రషర్’ పేరుకు తగ్గట్టే ఇది చిన్నగా ఉంటుంది. ప్రెసర్‌లా ఉండే దీనికి కింది భాగంలో ఒక చిన్న బౌల్ అమరి ఉంటుంది. దానిపై పదునైన బ్లేడ్స్, పైభాగంలో ఉండే మూతకు కింది వైపు పదునైన ప్రెసర్స్ ఉంటాయి. పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని బ్లేడ్స్‌పై ఉంచి మూతతో ప్రెస్ చేయడం వల్ల అవి ముక్కలై కింది బౌల్‌లో పడిపోతాయి.

గార్లిక్ క్రషర్ మాషర్

‘గార్లిక్ క్రషర్ మాషర్’. ఇది ఇక వెల్లుల్ని పేస్ట్ లా చేసేస్తుంది. కింద బౌల్, దానిపై అడుగున బ్లేడ్స్ ఉండే మరో బౌల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పొట్టు తీసేసిన వెల్లుల్ని రెబ్బల్ని వేసి.. పైనున్న ప్రెసర్ లాంటి మూతను బలంగా నొక్కుతూ తిప్పడం వల్ల ఆ వెల్లుల్లి రెబ్బలు బ్లేడ్స్ మధ్యలో పడి నలుగుతాయి. అలా తయారైన పేస్ట్ కింది భాగంలో ఉన్న బౌల్‌లోకి చేరుతుంది. దీన్ని నేరుగా మనం తయారుచేసే ఆహార పదార్థాల్లో వేసేసుకుంటే సరిపోతుంది.

వీటిధర కూడా ఏమంత ఉండదు. ఆన్ లైన్ లోనూ, సూపర్ మార్కెట్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఓ సారి ట్రై చేయండి మరీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news