తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ జయలలిత ఎన్నో సినిమాలలో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. జయలలితను తమిళ ప్రజలు ముద్దుగా ఈమెను అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు..జయలలిత డిసెంబర్ 5వ తేదీ 2016 వ సంవత్సరంలో మరణించడం జరిగింది. అయితే ఇంతవరకు జయలలిత ఆస్తి ఎంత ఉందనే విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
జయలలిత ఆస్తులలో ముఖ్యంగా ఫోమేస్ గార్డెన్ ఆమెకు చాలా ఇష్టమట. ఇది 24 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నదట.. దీని విలువ దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఇదే కాకుండా తమిళనాడులోని కంచ పురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నది అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 15 ఎకరాలు భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జయలలితకు 4 వాణిజ్య భవనాలు కూడా ఉన్నవి.. అందులో ఒకటి హైదరాబాదులో ఉన్నది.దీనిని శశికళ దత్తకు తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక జయలలిత దగ్గర ఉన్న బంగారు ఆ భరణాల విషయానికి వస్తే 21,280,30 గ్రాముల బంగారం ఉన్నట్లుగా సమాచారం. ఇక వెండి కూడా ఈమెకు 1000 కిలోలకు పైగా ఉన్నట్లు సమాచారం. దీని విలువ సుమారుగా అప్పట్లోనే రూ.3 కోట్లకు పైగా విలువ ఉన్నట్లు సమాచారం. ఇక జయలలిత పేరు మీద రూ. 50 కోట్ల నగదు, చరాస్తులు రూ.100 కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే కాకుండా పలు సంస్థలలో కూడా ఈమె రూ. 30 కోట్ల రూపాయల పెట్టుబడులు అప్పట్లోనే పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ సంపాదించినట్లుగా సమాచారం. ఇక దాదాపుగా జయలలిత ఆస్తి రూ.900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈమె మరణించగానే ఈ ఆస్తి ఎవరికి చెందుతుందో వీలునామాలో రాయలేదట. అయితే ఈ ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వమే జప్తు చేసుకున్నట్లుగా సమాచారం.