ఇండియాలో రోజుకు ఎన్ని గంటలు స్మార్ట్‌ఫోన్లను చూస్తున్నారో తెలుసా?

-

స్మార్ట్‌ఫోన్ ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది.. సెల్ఫీల పిచ్చి ఎక్కువ కావడం కూడా ఒక కారణం కావొచ్చు..రకరకాల యాంగిల్స్ తీరొక్క ఫోటోలు క్లిక్ మనిపించేవారు. రాను రాను కొత్త ఒరవడి తయారైంది. సెల్ఫీలు కాస్త షార్ట్ వీడియోస్, రీల్స్ గా మారిపోయాయి. సెల్ఫీలను వదిలేసి రీల్స్ వెంటబడ్డారు యువతీ యువకులు.

భారతీయులు స్మార్ట్‌ ఫోన్‌లలో వినోద కంటెంట్‌ను చూసేందుకు రోజుకు దాదాపు 156 నిమిషాల సమయం కేటాయిస్తున్నారట. నిజానికి, సగటున, ఒక భారతీయ వినియోగదారు ప్రతిరోజూ దాదాపు 38 నిమిషాల షార్ట్ ఫారమ్ కంటెంట్‌ ని చూస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ప్రకారం, షార్ట్-ఫారమ్ యాప్‌లు 2025 నాటికి తమ నెలవారీ యాక్టివ్ యూజర్ బేస్ 600 మిలియన్లకు రెట్టింపు అవుతాయని తేల్చింది. 2030 నాటికి $19 బిలియన్ల మానిటైజేషన్ అవకాశాన్ని కలిగి ఉంటుందని వెల్లడించింది. షార్ట్-ఫారమ్ యాప్ మార్కెట్‌లో మోజ్, జోష్, రోపోసో, ఎమ్‌ఎక్స్ తకటాక్, చింగారి మొదలైనవారు ట్రెండ్ లో ఉన్నట్లు తెలిపింది.

మనదేశంలో 8 కోట్ల మంది వీడియో కంటెటం క్రియేటర్‌లు ఉన్నారు. వారిలో కేవలం 1.5 లక్షల మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్‌లు మాత్రమే తమ సేవలను సమర్థవంతంగా వినియోగించి, డబ్బును సంపాదిస్తున్నారు. దేశంలోని 8 కోట్ల మంది క్రియేటర్‌లలో కంటెంట్ క్రియేటర్‌లు, వీడియో స్ట్రీమర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బ్లాగర్‌లు, OTT ప్లాట్‌ ఫారమ్‌ల లోని క్రియేటర్‌లు, ఫిజికల్ ప్రొడక్ట్ క్రియేటర్‌లు ఉన్నట్లు తాజాగా నివేదిక వెల్లడించింది. 1.5 లక్షల మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్‌ల లో చాలా మంది నెలకు 200 డాలర్ల నుంచి 2,500 డాలర్ల సంపాదిస్తున్నారు.షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో 50,000 మంది ప్రొఫెషనల్ క్రియేటర్‌లు ఉన్నారు.. వారు నేరుగా తమ వీడియోలను క్రియేట్ చేస్తూ భారీగా డబ్బులను అర్జిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news