కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఈ వ్యవసాయ చట్టాలు రైతులకి ఉపయోగపడేలా లేవని, కార్పోరేట్లకి రైతులని బానిసలుగా చేసేలా ఉన్నాయని, అందుకే రైతు చట్టాలని వెనక్కి తీసుకోవాలని నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో కొన్ని అల్లర్లు కూడా చెలరేగాయి.
ఐతే తాజాగా ట్రాక్టర్ల ర్యాలీ దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు రైతాంగం సిద్ధం అవుతోంది. ఈసారి 40లక్షల ట్రాక్టర్లచే దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడతామని, వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కీ తీసుకోవాలని, లేదంటే నిరసనలు చేపడుతూనే ఉంటామని, అవి రద్దయ్యే దాకా ఉద్యమం ఆగదని బీకేయూ నేత రాకేష్ టికాయత్ అన్నారు. ఇప్పటికే రైతాంగం చేపట్టిన నిరసన 70రోజులకి చేరువైంది. మరి దీనిపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.