ఈ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రియశిష్యుడు.. ఎవరో మీకు తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని మహేశ్ బాబు, శ్రీకాంత్ తనయుడు రోషణ్ వరకు పలువురు హీరోలతో సూపర్ హిట్ పిక్చర్స్ చేశారు. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకేంద్రుడు గా పేరు గాంచాడు. కమర్షియల్ సినిమాకు సరి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడిగా ఆయన చరిత్రలో ఉండిపోతారని సినీ పరిశీలకులు చెప్తుంటారు.

రాఘవేంద్రరావు ఇటీవల ‘పెళ్లిసందడి’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇన్నాళ్లు దర్శకుడిగా ఉన్న ఆయన ఇక నటుడిగానూ తన ప్రస్థానం కొనసాగించనున్నారు. పలు సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు నటుడిగానూ రాఘవేంద్రరావు రాణించనున్నారు. కాగా, ఓ సినిమా షూటింగ్ టైమ్ లో రాఘవేంద్రరావు ప్రియశిష్యుడుగా ప్రముఖ దర్శకుడు ఉన్నారు. ఆయన ఎవరో ఇవాళ తెలుసుకుందాం.

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, టబు జంటగా నటించిన పిక్చర్ ‘కూలీ నెం.1’ . ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ రాఘవేంద్రరావు ప్రియశిష్యుడుగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా జయంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘కూలీ నెం.1’ మూవీ షూటింగ్ టైమ్ లో తనకు ప్రతీ ఒక్క విషయం క్లారిటీగా దర్శకుడు రాఘవేంద్రరావు వివరించారని జయంత్ సి.పరాన్జీ తెలిపారు. ఒక్కో సీన్ షూట్ చేయడం దగ్గరి నుంచి పాటలను ఎలా తీయాలి? బ్యాక్ గ్రౌండ్ ఎలా వాడుకోవాలి? లైటింగ్ తదితర విషయాలను తాను రాఘవేంద్రరావు దగ్గరి నుంచి నేర్చుకున్నానని చెప్పాడు జయంత్. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో తాను ఫిల్మ్ స్కూల్ కు వెళ్లినట్లు ఫీలయ్యానని స్పష్టం చేశారు జయంత్. జయంత్ తర్వాత కాలంలో విక్టరీ వెంకటేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో సినిమా లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news