ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు విడతలుగా ఈ ప్రజా సంగ్రామయాత్ర చేపట్టిన బండి సంజయ్ ఇప్పుడు మూడో విడత ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. యాదాద్రి జిల్లా ముక్తాపూర్ వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. మూసినీటిని శుద్ధి చేస్తానని అన్న సీఎం మాట మరిచారని ఆరోపించారు. కాబట్టి మూసి నీటిని సీఎం కు పంపిస్తున్నామని, వేలకోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. నిధులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు బండి సంజయ్. 21న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారన్నారు బండి సంజయ్. రాజగోపాల్ రెడ్డి మోడీ నాయకత్వంలో పనిచేస్తారని, పార్టీలో చేరుతారని అమిత్ షా నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని బండి సంజయ్ తెలిపారు.
దాసోజు శ్రవణ్ ను బీజేపీ పార్టీలో చేరాలని నేను బీజేపీ సగర్వంగా ఆహ్వానిస్తున్నామని, జాతీయ భావాలు ఉన్న వ్యక్తి దాసోజు శ్రవణ్ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర, సాంస్కృతి, ఉద్యమం పై అవహగన ఉన్న వ్యక్తి దాసోజు శ్రవణ్ అని ఆయన కితాబిచ్చారు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి క్రాంట్రాక్టర్, వ్యాపారస్తుడని, దుబ్బాకలో, హుజురాబాద్, డిపాజిట్ దక్కించుకోలేని కాంగ్రెస్ కు మునుగోడు లో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.