ఈ సారి శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయకూడదు తెలుసా..?

-

ఆషాడం ముగిసింది. ఇక వచ్చేది శ్రావణ మాసం.. సాధారణంగా శ్రావణ మాసం అంటే శుభాకార్యాల మాసంగా అందరూ అంటుంటారు. ఆషాడంలో వాయిదా వేసిన పెళ్లిళ్లు, ఇంకా ఇతరత్రా శుభకార్యాలు అన్నీ శ్రావణంలో స్టాట్‌ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం మంచిది కాదట. శ్రావణ మాసం ఈసారి రెండు నెలలు వస్తుందని అంటున్నారు. ఇలా వస్తే అధిక మాసం అంటారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు చేసుకోవద్దు అంటారు. ఈ నేపథ్యంలో అధికమాసం అని అంటే ఏమిటి? ఈ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా శ్రావణం మాసం అంటే శుభకార్యాల నెలగా చూస్తారు. అయితే ఈ ఏడాది ఆషాఢ మాసం అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరాక్రమ కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకుని లెక్కకట్టే కాలమానాన్ని సౌరమానం అని అంటారు. చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే సంవత్సర గణనాన్ని చాంద్రమానం అని అంటారు

చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు. సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. దక్షిణాదిలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు. ఉత్తరాదిలో సూర్యమనాన్ని అనుసరిస్తారు. చాంద్రమానంలో ప్రతి నెల అవధిగా అమవాస్యను పరిగణిస్తే, సూర్యమనంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు.

సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య ఏడాదిలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా సౌరమానం, చాంద్రమానంలో ప్రతీ 4 ఏళ్లలో 31 రోజులు అవుతుంది. అలా అధిక మాసంగా ఏర్పడుుతుంది. 32 నెలలకు ఒకసారి ఏర్పడే మాసాన్ని అధిక మాసం అని అంటారు. అధిక మాసము శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన మాసం. అందుకే అధికమాసానికి పురుషోత్తమ మాసమని కూడా పేరు వచ్చినట్లు చెప్పబడినది.

విష్ణుమూర్తి అధిక మాసంలో పురుషోత్తమ పేరుతో ఇంటిఇంటికి తిరుగుతుంటాడట. అందువల్ల ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించాలని, వేరే శుభకార్యాలు చేయకూడదని బ్రహ్మదేవుడు నిషేధించాడు. ఒకవేళ అలా జరుపుకుంటే విష్ణుమూర్తిని పూజించడం మాని సొంతకార్యాలు చేసుకున్న పాపానికి గురై భ్రష్టులవుతారని బ్రహ్మదేవుడు అజ్ఞాపించారట. 2023లో జూలై 18 నుండి అధిక మాసం మొదలు అవుతుంది. ఈ సారి అధికంగా శ్రావణమాసం రానుంది. సాధారణంగా ఆషాఢం మాసం పూర్తి అవగానే శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈసారి అసలైన శ్రావణ మాసం 2023 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు అని జ్యోతిష్యు నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news