మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యానికి మేలు చేసేది అయి ఉండాలి తప్ప ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగించకూడదు. మనం మంచి ఆహారాన్ని తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన సమస్యలు తప్ప ఫలితం ఏమీ ఉండదు. కొన్ని రకాల ఆహార పదార్థాలని అస్సలు తీసుకోకూడదు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే మనకి శక్తి పూర్తిగా తగ్గిపోతుంది మనమే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని మన శక్తిని కోల్పోయేలా చేస్తాయి.
ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో శరీరం బాగా అలసిపోతుంది. కాఫీని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా శక్తిని కోల్పోతారు. కాఫీ తాగితే ఎనర్జీ తొందరగా డ్రైన్ అవుతుంది నిద్రలేమి సమస్య కూడా కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ని తీసుకోవడం వలన కూడా త్వరగా మనం నీరసం అయిపోతాము. అలసిపోతూ ఉంటాము. ఆల్కహాల్ ని తీసుకోవడం వలన కూడా మన ఎనర్జీ ఫుల్లుగా అయిపోతుంది. నిద్ర మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది.
ఆల్కహాల్ ని తీసుకున్నప్పుడు బానే ఉంటుంది కానీ తర్వాత మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాలి. ఎనర్జీ డ్రింక్ ని తీసుకుంటే కూడా శక్తి బాగా లభిస్తుంది కానీ దీనిలో ఉండే కెఫెన్ షుగర్ వలన త్వరగా మనం ఆవిరిపోతూ ఉంటాము. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు వలన కూడా ఇదే జరుగుతుంది. ఐరన్ లేని ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఎనర్జీ బాగా తగ్గిపోతూ ఉంటుంది తక్కువ కేలరీలు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా అలసిపోతూ ఉంటాము. సో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అలసిపోతామని గుర్తు పెట్టుకోండి.