రిజర్వేషన్ కౌంటర్లు రీఓపెన్.. ఈజీగా జనరల్ టికెట్ బుకింగ్

-

కరోనా దెబ్బ నుంచి కోలుకుని భారత రైల్వే రైళ్ల శాఖలో 65 శాతానికి పైగా రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్లు బాగానే ఉన్నాయి. కానీ రిజర్వ్ చేయనివారికి అంటే జనరల్ టికెట్ కోసం, ప్రయాణికుల సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌కి పరిమితమైన రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థ ఇప్పుడు అన్ని స్టేషన్లలో ఆఫ్‌లైన్లలో కూడా మొదలైంది. కరోనా నిబంధనలు పాటించటం చాలా అవసరం.. కానీ టికెట్ కౌంటర్ల వద్ద సామాజిక దూరం ఉండటం లేదు. ఈ సమస్యను తొలగించేందుకు భారత రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ కౌంటర్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా రైల్వేశాఖ వెల్లడించింది.

railways
railways

అయితే మొబైల్ యాప్ సౌకర్యంపై యూటీఎస్‌ను తిరిగి ప్రారంభించినట్లుగా భారత రైల్వే శాఖ తెలిపింది. రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి రానటువంటి జోన్లలో టిక్కెట్లను బుకింగ్ చేసుకునేందుకు కోసం మొబైల్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని శాఖ కల్పిస్తోంది. దీనికి సంబంధించి అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేశారు. రిజర్వ్ చేయని రైలు సర్వీసుల కోసం జోనల్ రైల్వేలకు తమ ప్రాంతంలో యూటీఎస్ మొబైల్ యాప్ సేవలను అమలు చేసే హక్కు ఉంటుంది.

కరోనా వల్ల 5వేల కోట్లు నష్టం
కరోనా సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వేకు సుమారు రూ.5,000 కోట్ల నష్టం వాటిల్లిందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ ప్రభావం అన్ని సేవలపై పడనున్నట్లు వెస్ట్రన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అలోక్‌ కంసల్‌ తెలిపారు. కరోనా వల్ల 5వేల కోట్ల నష్టం. కరోనాకు ముందు పశ్చిన రైల్వేలో సుమారు 300 ప్యాసింజర్ రైళ్లను నడిపిందని జీఎం వెల్లడించారు. ప్రస్తుతానికి 145 ప్యాసింజర్ ట్రైన్లను ప్రారంభించామని, రాబోయే వారం రోజుల్లో మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్ల ద్వారా 19లక్షల మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు జీఎం పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ మొబైల్ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుకింగ్ సులువు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news