Facebook, WhatsApp, Instagram ఉద్యోగుల సగటు జీతం ఎంత ఉంటుందో తెలుసా..?

-

అత్యధికంగా డబ్బులు సంపాదించే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే సాఫ్‌వేర్‌ అనే అంటారు. మెటా నేడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకటి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ప్రతిరోజూ ఎక్కువ సమయం గడుపుతుంటారు. అసలు ఇందులో పనిచేసే వాళ్లకు ఎంత జీతాలు ఉంటాయో తెలుసా..?
ఈ వెబ్‌సైట్‌లు వాడటం వల్ల వ్యూవర్‌ టైమ్‌ వేస్ట్‌ అవుతుంది కానీ దీన్ని మెయింటేన్‌ చేసే వాళ్ల టైమ్‌ మాత్రం అస్సలు వేస్ట్‌ కాదు. ఇన్‌ఫ్లూయెన్సర్లు రీల్స్‌ చేసి వాళ్లు డబ్బులు సంపాదిస్తున్నారు. ఉద్యోగులు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎటొచ్చి..దీన్ని వాడేవాళ్లే టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారు. ఈ యాప్‌లను ఉపయోగించి ఆదాయం పొందడం వేరు, ఈ యాప్‌లలో ఉద్యోగులుగా జీతం పొందడం వేరు. ఈ Facebook, Instagram మరియు WhatsApp ఉద్యోగుల సగటు జీతం విషయానికి వస్తే..
2023లో, Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ $24.4 మిలియన్ల పరిహారం పొందారు. మెటా ప్రపంచవ్యాప్తంగా 67000 మంది ఉద్యోగులను కలిగి ఉందని నివేదిక వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం, మెటాలో పనిచేసే ఉద్యోగుల సగటు జీతం సుమారు $379,000. అంటే సుమారు రూ. 3,16,09,718.05.
మధ్యస్థ ఆదాయం ఆధారంగా, 50% Meta ఉద్యోగులు 2018లో $379,000 కంటే ఎక్కువ సంపాదించారు. కానీ మిగతా 50% ప్రజల ఆదాయం దీని కంటే తక్కువ. ఇక్కడ అతి తక్కువ వార్షిక జీతం రిసెప్షనిస్ట్. అతని వార్షిక ఆదాయం $40,000. అంటే దాదాపు 33,35,944 రూపాయలు.
కార్యాలయ పని విభాగానికి సగటు మెటా జీతాలు: వ్యాపార అభివృద్ధి $112,477 (94 లక్షలు), ఉత్పత్తి $212,017, లీగల్ $204,180 మరియు కస్టమర్ మద్దతు $108,745.
ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగం రావాలంటే అంత చిన్న విషయం కాదు.. ఇందులో జీతం ఎంత ఎక్కువగా ఉంటుందో రిస్క్‌ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news