కరోనా నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్ గతేడాది చివర్లో ముగిసింది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఐపీఎల్‌ను భారత్‌లోనే స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. మే 30న ముగియనుంది. అయితే వచ్చే ఏడాది.. అంటే.. 2022 ఐపీఎల్ లో 2 కొత్త టీమ్‌లు ఉంటాయని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం విదితమే. ఆ టీమ్‌లకు గాను బిడ్డింగ్ ప్రక్రియను మే నెల చివరి వరకు పూర్తి చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
ఇక కొత్త టీమ్‌లలో ఒక్కో టీమ్ కనీస ధర రూ.1500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు బిడ్డింగ్‌లో అధిక మొత్తం చెల్లించే వారికి టీమ్ లను కేటాయిస్తారు. అయితే రూ.1500 కోట్లు పెట్టి టీమ్‌ను కొన్నా భవిష్యత్తులో దాని రేటు ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ ఓనర్ జీఎంఆర్ గ్రూప్ టీమ్ వాటాలో 50 శాతం మేర జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు వాటాను విక్రయించింది. రూ.1100 కోట్ల వాటాను జీఎంఆర్ విక్రయించింది. ఈ క్రమంలో టీమ్‌లను అంత పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినా భవిష్యత్తులో ధర రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కనుక ఆయా టీమ్ లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రూ.1500 కోట్ల కన్నా తక్కువ కాకుండా టీమ్‌లను విక్రయిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.
కాగా ఐపీఎల్‌లో ఈసారి జట్లకు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉండడం లేదు. ఒక్క టీమ్ తన మ్యాచ్‌లను భిన్న స్టేడియాల్లో ఆడుతుంది. కానీ సొంత గ్రౌండ్‌లో ఆడదు. టీమ్‌లు ప్రయాణం చేసే సమయాన్ని, వేదికలను తగ్గించాలనే బీసీసీఐ ఇలా ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందించింది.