హీరో వెంకటేష్ వాడుతున్న విగ్గు ఖరీదు ఎంతో తెలుసా..?

-

సాధారణంగా హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది . కానీ సెలబ్రిటీల విషయంలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ..అధిక ఒత్తిడి.. సరైన సమయానికి భోజనం తీసుకోకపోవడం లాంటి కారణాలవల్ల త్వరగా బట్టతల పడిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమాలలో మెప్పించాలి అంటే తమ సొంత జుట్టుతో ముందుకు వెళ్లడం కుదరదు. కాబట్టి చాలామంది ప్రత్యేకంగా తమ శరీరాకృతికి.. స్టైల్ కి తగ్గట్టుగా విగ్గులు కూడా ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర హీరోల అభిమానాన్ని కూడా గెలుచుకున్న హీరోగా వెంకటేష్ కు మంచి పేరు ఉంది.

1985లో వచ్చిన కలియుగ పాండవులు సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఎఫ్ 3 సినిమా వరకు కెరియర్ పరంగా అంతకంతకు ఎదిగిన వెంకటేష్ వరుసగా విజయాలను సాధిస్తున్నా.. ఒదిగి ఉండడానికి ఇష్టపడతారు . ఏ రోజు కూడా ఆడంబరాలకు వెళ్లని ఈయన సినిమాలలో విగ్గు వాడతారు అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా తన లుక్ నాచురల్ గా ఉండడంతో ఆయన విగ్గు వాడతారు అని చెప్పినా ఎవరు నమ్మరు. కానీ తాజాగా వెంకటేష్ మేకప్ మెన్ రాఘవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు.

వెంకటేష్ కు గెటప్ కి తగిన విగ్గు పెడతామని..ఆ విగ్గులు విదేశాల నుంచి తెప్పిస్తామని.. ఒక్కొక్క విగ్గుకు 70 వేల రూపాయలు ఖర్చవుతుంది అని కూడా ఆయన తెలిపారు.నారప్ప మూవీ కి వేరే స్టైల్ విగ్గు ఉపయోగించామని కూడా రాఘవ చెప్పుకొచ్చారు. త్వరలో రాబోతున్న రానా నాయుడు సినిమాకి కూడా బాంబేలో విగ్గు చేయించామని ఆయన కామెంట్లు చేశారు. వెంకటేష్ గారికి జుట్టు పలుచగా ఉండడం వల్లే పాత్ర కోసం విగ్గు పెట్టాల్సి వస్తుందని కూడా రాఘవ కామెంట్లు చేశారు.. ఒక్కో విగ్గు నాలుగు నెలలు మాత్రమే వాడవచ్చని రాఘవ తెలిపారు. ఇకపోతే సినిమాలలోని పాత్రలకు అనుగుణంగా విగ్గు పెట్టాలి అని.. తాను కూడా అప్డేట్ అవుతూ ఉంటానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version