ఇప్పటివరకు జబర్దస్త్ లో కొనసాగిన జడ్జ్ ల పారితోషకం ఎంతో తెలుసా..?

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోలలో జబర్దస్త్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతోమంది కెరియర్ కు పునాది ఈ షో అని చెప్పవచ్చు. ఇక సీనియర్ హీరోయిన్ రోజా లాంటి వాళ్ళు కూడా ఆర్థిక సమస్య లతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా జబర్దస్త్ ఆమెను ఆదుకుంది. ఇక కేవలం రోజా మాత్రమే కాకుండా ఇప్పుడు హీరోలుగా చలామణి అవుతున్న ధన్ రాజ్ , గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్ , చమ్మక్ చంద్ర, వేణు లాంటి వారు కూడా కేవలం జబర్దస్త్ ద్వారానే తమ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది జడ్జిలు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిజానికి గత తొమ్మిది సంవత్సరాలు నుంచి రోజా, నాగబాబు నిరంతరాయంగా జడ్జిలుగా పనిచేశారు. కానీ పారితోషకం విషయంలో గొడవ రావడంతో నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. మారి ఈ జడ్జిల పారితోషకం ఎంత ఉంది అనే విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

రోజా:

సీనియర్ హీరోయిన్గా, మంత్రిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రోజా సినిమా పరంగా భారీగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈమెకు మల్లెమాలవారు బాగానే పారితోషకాన్ని అందించారు. ఒక్కొక్క ఎపిసోడ్ కు రోజాకు సుమారుగా రూ.5 లక్షలు అందించారు. ఇక ఆ తర్వాత కాలంలో ఈమే పారితోషకం పెరిగిన విషయం తెలిసిందే. కానీ ఈమెకు ఇటీవల మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ జడ్జ్ స్థానానికి గుడ్ బై చెప్పింది.

నాగబాబు:

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు హీరోగా ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ.. హీరో కాలేకపోయారు. కానీ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక రోజాతో పాటు నాగబాబు కూడా జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించారు. కానీ ఇండస్ట్రీలో రోజా కంటే తక్కువ గుర్తింపు ఉన్న నాగబాబుకు కేవలం ఎపిసోడ్ కు రూ.3 లక్షలు మాత్రమే అందించేవారు . దీనితో ఇన్సల్ట్ గా ఫీల్ అయిన నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు.

ఇంద్రజ:

ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడ్ బాయ్ చెప్పిన ఇంద్రజ జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుంది.

కృష్ణ భగవాన్:

Krishna Bhagavaan - Wikipedia
తాజాగా కృష్ణ భగవాన్ ఇంద్రజాతో కలిపి జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈయనకు ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇక మల్లెమాలవారు ఎప్పుడూ కూడా సినిమాలలో వీరికుండే ఇమేజ్ ను బట్టి పారితోషకం ఫిక్స్ చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news