కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

-

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ.. ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. ముఖ్యంగా ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. దాంతో ఫిలింనగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కైకాల కు సంబంధించిన ఆస్తుల గురించి వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి కైకాల సత్యనారాయణ 60 సంవత్సరాల సినీ జీవిత కాలంలో ఎంత డబ్బు సంపాదించారు అనేది ఇప్పుడు చూద్దాం.

దివంగత నటుడు ఎన్టీఆర్ తో సమానంగా సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్న కైకాల సత్యనారాయణ విలనిజంతో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా యముడు పాత్ర అంటే అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కైకాల. అందరి హీరోల సరసన విలన్ గా చేసి నటసార్వభౌముడిగా కీర్తి గడించారు. దాదాపు 776 సినిమాలలో నటించి రికార్డు నెలకొల్పిన కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆస్తుల వివరాల్లోకి వెళితే హైదరాబాదు తో పాటు చెన్నైలో సొంత ఇల్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి .ముఖ్యంగా వాటిల్లో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కాగా.. మరొకటి ఇన్నోవా క్రిష్టా.. ఈ రెండింటి ధర అక్షరాల రూ.96 లక్షలు.

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో నాగార్జున రెసిడెన్సి లో ఒక ఫ్లాట్ ఉన్నట్లు.. దాని విలువ 1.47 కోట్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కైకాల ఆస్తుల విలువ సుమారుగా రూ. 40 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా కైకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చింది. సినీ రాజకీయ నాయకులు ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news