టీడీపీ అధినేత చంద్రబాబులో మార్పు బాగా కనిపిస్తోంది..అంతకముందు బాబు స్పీచ్‌లు చాలా వరకు బోరు కొట్టేవి..అసలు పాయింట్ చెప్పకుండా…ఎక్కువ సోది చెబుతూ వచ్చేవారు. దీని వల్ల బాబు స్పీచ్‌లు పేలవంగా సాగేవి. అలా పేలవంగా స్పీచ్‌లు ఇచ్చే బాబు..ఇప్పుడు దూకుడుగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మళ్ళీ గెలిపించడమే టార్గెట్ గా పెట్టుకున్న బాబు..ఈ మధ్య జనాల్లోనే తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ పేరుతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో బాబు పర్యటనలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆయన ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. తాజాగా రాజాం నియోజకవర్గంలో పర్యటించగా, అక్కడ బాబు రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవల బాబు బాబు స్పీచ్‌లు ప్రజల్లోకి బలం వెళుతున్నాయి. ఆయన ఇదివరకు లాగా సోది చెప్పకుండా పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం వల్ల ఎలా నష్టం జరిగింది..తాను వస్తే ఎలా రాష్ట్రాన్ని గాడిలో పెడతాననే అంశాలని చెబుతున్నారు.
తాజాగా రాజాంలో కూడా అలాంటి కీ పాయింట్లే చెప్పారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రం తగలబడిపోయిందని, జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని రాష్ట్రం గురించి కేంద్రం పార్లమెంటులో చెప్పిందిని, చదువుకున్నా ఉద్యోగం వస్తుందో, రాదో అని కొందరు విద్యార్థినులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, తనపై బాధ్యత వేయండని, తాను అందరి బాగును చూసుకుంటానని అంటున్నారు.
సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి అనే నినాదాన్ని పదే పదే చెబుతున్నారు. జగన్‌ది భస్మాసుర హస్తం.. అన్ని వ్యవస్థలూ నాశనం అయ్యాయని, పది ఇవ్వడం.. వంద నొక్కడమే జగన్ విధానమని, ఉత్తరాంధ్రే కాదు.. రాష్ట్రమంతా విధ్వంసం చేశారని, విశాఖలో తిష్ఠవేసి జగన్ గ్యాంగ్ దోచుకుంటుందని, తాను వస్తే సంపద సృష్టిస్తానని, సంక్షేమం సాగిస్తానని అంటున్నారు. అంటే ప్రతి పాయింట్ ప్రజలకు చేరేలా మాట్లాడుతున్నారు. దీని వల్ల బాబుకు ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.