శర్వానంద్ ప్రేయసి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

-

ప్రముఖ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే తనకంటూ ఒక క్రేజ్ సొంతం చేసుకున్న శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో చిన్నచితకా సినిమాలు చేసి ఆ తర్వాత ప్రామిసింగ్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉండగా హీరో శర్వానంద్ కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రస్థానం. దేవాకట్టా తెరకెక్కించిన ఈ సినిమాలో మిత్రగా శర్వా అభినయం అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ రూబీ పరిహార్.

ప్రస్థానం సినిమాలో శర్వానంద్ కి గర్ల్ ఫ్రెండ్ గా శర్వానంద్ ను ఆట పట్టించే దివ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే ఈమె హిందీ అమ్మాయి అయినా కూడా ప్రస్థానం సినిమాలో మాత్రం అచ్చు తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది. అలా తెలుగుతోపాటు కన్నడ, తమిళ్ భాషల్లో కూడా అవకాశాలు అందుకుంది.

ఇక ప్రస్థానం సినిమా తర్వాత రాజేంద్ర , ప్రేమలో ఏబీసీ, కమీణా, యక్ష తదితర సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫెడ్ అవుట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది . చివరిగా 2014లో ఇట్స్ మై లైఫ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన రూబీ కి ఈ సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. అటు బాలీవుడ్ లో కూడా దారులు మూసుకుపోయాయి అవకాశాలు తక్కువ అవడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. నిత్యం గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న ఈమె అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ruby Pari (@rubyparihar)

Read more RELATED
Recommended to you

Latest news