YS వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక తీర్పు వెలువడనుంది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు లో ఇవాళ తీర్పు వెలువడనుంది. 2019 లో ఎర్ర గంగిరెడ్డి ని అరెస్ట్ చేసిన అప్పటి సిట్.. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ పై విడుదలయ్యాడు గంగిరెడ్డి.
అయితే, గంగిరెడ్డి బెయిల్ రద్దుపై పులివెందుల కోర్టు తీర్పును సమర్దించింది AP హైకోర్టు. గంగిరెడ్డి బెయిల్ రద్దునపై సుప్రీంకోర్టు వెళ్లింది సీబీఐ. తెలంగాణ హైకోర్టు లో తేల్చుకోవాలని సీబీఐ కి సూచించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు లో మూడు వాయిదాల్లో ముగిసింది వాదనలు. ఇక ఇవాళ నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు లో ఇవాళ తీర్పు వెలువడనుంది.