హైదరాబాద్ నుండి ఊటీ టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు మీకోసం…!

-

చాలా మంది ఊటీ వెళ్లాలని అనుకుంటారు. మీకు కూడా ఊటీ వెళ్లాలని ఉందా..? అయితే ఇలా ఈ ప్యాకేజీ తో మీరు ఊటీ వెళ్లి వచ్చేయచ్చు. హైదరాబాద్ నుండి ఊటీ టూర్ ప్యాకేజీ ని IRCTC తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఊటీ ని చూడడానికి వేసవితో పాటు శీతాకాలంలో కూడా పర్యాటకులు వెళ్తూ వుంటారు.

ఎండలు మండిపోతుంటే ఊటీ లోని చల్లని వాతావరణాన్ని ఆస్వాదించేందుకు టూరిస్ట్స్ వెళ్లారు. వేసవి కాలంలో ఊటీ వెళ్లి ప్రకృతి అందాలు చూడచ్చు. అక్కడ ఒక నాలుగు రోజులు స్పెండ్ చేస్తే ఎంతో బాగుంటుంది. అల్టిమేట్ ఊటీ పేరుతో ఈ ప్యాకేజీ ని IRCTC తీసుకు వచ్చింది.

ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుండి అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ధర విషయానికి వస్తే… స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్‍‌కు రూ.11,870, డబుల్ షేరింగ్‍‌కు రూ.15,220, సింగిల్ షేరింగ్‌కు రూ.28,950 కట్టాలి. కంఫర్ట్ ప్యాకేజీ విషయానికి వస్తే… ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,330, డబుల్ షేరింగ్‌కు రూ.17,670, సింగిల్ షేరింగ్‌కు రూ.31,410 చెల్లించాలి. అయితే ఎంత మంది వెళ్తున్నారో దాని బట్టీ రేటు ఉంటుంది. వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూడచ్చు. ఊటీ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో మొదలు అవుతుంది.

మొదటి రోజు పర్యాటకులు మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు.
అక్కడ నుండి ఊటీకి వెళ్ళాలి.
హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ కి వెళ్ళచ్చు. రాత్రికి ఊటీ లో ఉండాలి.
మూడో రోజు ఊటీ లోకల్ టూర్ వెయ్యచ్చు.
దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడొచ్చు.
నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది.
రాత్రి మళ్ళీ ఊటీ రీచ్ అవ్వచ్చు.
ఐదో రోజు ఊటీ నుంచి కొయంబత్తూర్ రావాలి. సాయంత్రం 4.35 గంటలకు కొయంబత్తూర్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ వచ్చేస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news