భారతదేశం ఆలయాలకు ప్రసిద్ధి. భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. అయితే దేశమాత విగ్రహ రూపంలో కొలువైన ఆలయం ఉంది. గౌరిబిదనూరులో దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటుంది. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్రం గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది.
కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తోంది. దేవాలయంలో దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ తదితర బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఏటా జనవరి 26, ఆగస్టు 15న ప్రత్యేక పూజలు చేస్తారు.