తక్కువ వడ్డీరేట్లలో హోమ్ లోన్‌ అందిస్తున్న ఐదు బ్యాంకులు ఏవో తెలుసా?

-

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 2022 నుంచి వడ్డీ రేట్లను ఆరు సార్లు పెంచింది..దీంతో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో కస్టమర్లపై అధిక ఈఎంఐ భారంపడింది. అయితే కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇప్పటికీ గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇక ఆలస్యం లేకుండా వాటి గురించి తెలుసుకుందాం..

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు హోమ్‌లోన్‌పై 8.55 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 20 ఏళ్లలో రూ.75 లక్షల రుణానికి ఈఎంఐ చెల్లింపు రూ.65,324 అవుతుంది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రుణ మొత్తం కాలానికి ఈఎంఐ చెల్లింపు రూ.65,662 అవుతుంది..

అదే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై 8.65 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. 20 ఏళ్లలో రూ.75 లక్షల రుణం కోసం వినియోగదారుడు రూ.65,801 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి 8.45 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. 20 ఏళ్ల కాలానికి రూ.75 లక్షల రుణంపై రూ.64,850 ఈఎంఐ చెల్లించాలి..

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై 8.75 శాతం వడ్డీని అందిస్తోంది. 20 ఏళ్లలో రూ.75 లక్షల రుణం కోసం ఈఎంఐ చెల్లింపు రూ.66,278 అవుతుంది. అందువల్ల కస్టమర్లు నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను చెక్ చేసి లోన్ తీసుకోవడం మంచిది..

ఇకపోతే గృహ రుణాలపై వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని గుర్తుంచుకోండి. కాబట్టి కస్టమర్‌లు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు అందించే రేట్లను సరిపోల్చాలి.. అప్పుడే మీ పై వడ్డీ భారం తగ్గుతుంది.. ఇది గమనించగలరు..

Read more RELATED
Recommended to you

Latest news