తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. ఎన్నో సినిమాలలో హీరోగా కూడా నటించారు. కొన్ని సినిమాలకు దర్శకుడుగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. తన నటనకు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పటికీ విలన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. గతంలో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి అయ్యారు. మొదటిసారిగా ఇద్దరూ అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజుకు పేరు తెచ్చిన సినిమాలు మాత్రం హిట్లర్, చిరునవ్వుతో వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రకాష్ రాజ్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడ నటించారు. ప్రకాష్ రాజ్ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో పలు రకాల వార్తాలపై ఎప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఇక రాజకీయంగా కూడా బాగానే యాక్టివ్ గా ఉంటారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి ఎవరో కాదు శ్రీహరి భార్య డిస్కో శాంతి స్వయానా చెల్లెలు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
ఇక లలిత కుమారి కూడా తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక వీరిద్దరు 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు జన్మించారు. అయితే తన కుమారుడు నాలుగేళ్లకే మరణించాడు. ఆ తర్వాత ఈ దంపతులు మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. అలా 2009లో విడాకులు తీసుకొని 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పాణి వర్మని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు. ఇక తన మొదటి భార్య ఖర్చులు తన ఇద్దరి కూతుర్ల వివాహం తానే చేస్తానని చెప్పి ప్రకాశరాజ్ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రకాష్ రాజ్ రెండవ వివాహనప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని కూడా తెలియజేసి వివాహం చేసుకున్నారని తెలియజేశారు.