ఈ పూలని ఎవరి దగ్గరి నుండి తీసుకోకూడదు మీకు తెలుసా..?

-

పురాణాల కాలం నుండి కూడా పారిజాతంకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. పారిజాత వృక్షాన్ని విష్ణు దేవుడు స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఈ పూలు ఎంతో సువాసనతో ఉంటాయి. ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని భూలోకానికి శ్రీకృష్ణుడు తీసుకు వస్తాడు. అందుకే పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు.

ఈ పూలు ఎర్రటి కాడలతో తెల్లగా ఉంటాయి. అలానే ఈ పారిజాత పూల లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది రకాలు ఉన్నాయి. సాధారణంగా మనం దేవుడికి పూజ చేసే పూలన్నీ కింద పడితే పూజ చేయము. కానీ పారిజాత పుష్పాలను మాత్రం నేల మీద నుంచి తీసుకుని దేవుడికి పెడతాము. భూమి నుంచి ఉద్భవించి పుష్పాలను వికసిస్తుంది ప్రతి ఒక్క చెట్టు.

కానీ పారిజాత వృక్షం స్వర్గలోకం నుండి వచ్చినది కనుక ఆ చెట్టు లో వికసించే పుష్పాలు నేలను తాకినప్పుడు మనం వాటిని పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ పుష్పాలని మాత్రం పొరపాటున కూడా ఎవరు ఇచ్చిన తీసుకోకూడదు. వాటిని తీసుకుని అసలు పూజ చేయకూడదు. ఒకవేళ ఆ పూలతో పూజ చేసినా సరే పూజా ఫలం దక్కదు. అందుకని ఎప్పుడూ కూడా పారిజాత పుష్పాలని ఎవరైనా ఇస్తే తీసుకుని వాటితో పూజ చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news