ఒళ్ళు వంచి పని చేసిందే లేదు.. ఈ సిఎం మాకొద్దు : కెసిఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఒళ్ళు వంచి పని చేసిందే లేదని..ఇలాంటి సిఎం మాకొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మాట ఇచ్చుడే కానీ చేసి చూపేది లేదని.. వాగ్దానాలు చేసుడే కానీ ఒళ్లు వంచి పని చేసేది లేదు.. ఆర్డర్లు ఏసుడే కానీ ఏండ్లయినా పట్టించుకునేది లేదు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వైఎస్ షర్మిల.

Sharmila
Sharmila

“చెవులకు ఇంపైన మాటలే కానీ చస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి మీరు. మీకెందుకు అధికారం, మీకెందుకు పదవి. మాటిచ్చి యాడాదైనా అదే మోసం.” అంటూ ఫైర్ అయ్యారు.

“ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతను మోసం చేసినవ్ కదా కేసీఆర్.రాష్ట్రంలో 39% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం నింపింది లేదు. నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే మీలో చలనం లేదు. మిమ్మల్ని కుర్చీ దించితే గానీ మా బిడ్డలు ఉద్యోగాలు ఎక్కరు. ఉద్యోగాలు ఇవ్వని CM మనకొద్దు.” అంటూ కెసిఆర్ ఫైర్ మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news