కొందరు మగవారు సింగిల్ గా వుండటానికి ఎక్కువగా ఇష్ట పడతారు..అయితే ఒంటరిగా ఉండటం అనేది చాలా మంది అనుభవించేదే. కొంత మంది పురుషులు ఒంటరిగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఎవరితోనూ అంతగా మాట కలపరు. వారికి సిగ్గు ఎక్కువ. తాము మాట్లాడితే ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న భయం వారిని వెంటాడుతుంది. తమ మాటల్లో తప్పులు దొర్లుతాయన్న బెంకు ఉంటుంది. వీటి కారణంగా వారి మనసులో ఏముందో బయటకు చెప్పరు.
ఎవరినైనా ఇష్టపడితే కనీసం వారితోనూ మాట్లాడలేరు. వీరికి అదృష్టం ఎక్కువగా ఉండి, వీరి మౌన ప్రేమను ఎదుటి వారు అర్థం చేసుకుంటే తప్పా.అలా ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండిపోతారు..గత సంబంధాల నుండి నొప్పి, బాధ మరియు ద్రోహం పురుషుల హృదయాలలో ఒక మచ్చను వదిలివేస్తుంది. వారు ఎంత బలంగా కనిపించినా, వారు సాధారణంగా తమ గత సంబంధాల నుండి చెడు అనుభవాలను పొందలేరు.గతంలో జరిగిన సంఘటన లు కూడా అందుకు కారణం..
ఫ్లర్టింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల చాలా మంది సింగిల్ గా ఉండిపోతారు. వారిలోని రొమాంటిక్ యాంగిల్ ను సజావుగా కమ్యూనికేట్ చేయలేరు. ఏదో ట్రై చేసి మరేదో చేస్తారు. వాళ్లు అనుకునేది ఒకటి, చేసేది మరొకటి ఉంటుంది..స్త్రీలతో పోలిస్తే పురుషులు తమ ఎంపికలను నిజంగా ఇష్టపడతారని తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. కొంత మంది పురుషులు తమ భాగస్వామిలో తమకు కావలసిన లక్షణాలను చాలా ఎంపిక చేసుకోవడం. డిమాండ్ చేయడం వల్ల వారు సంబంధాన్ని ఏర్పరచుకోలేరు…
ధైర్యం ఉన్న మగవారిని మాత్రమే ఆడవాళ్ళు ఇష్ట పడతారు..తమ గోల్స్, తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోని పురుషులు అంటే మహిళలకు ఇష్టం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. తమ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయని వారు స్త్రీలకు నచ్చరు..ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి..