ఇవాళ సాయంత్రం వైజాగ్ తీరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. దీనిపై తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మోదీ సభ ద్వారా రాష్ట్ర అవసరాలను, రావాల్సిన ప్రాజెక్టుల గురించి అడిగే అవకాశం లభించిందన్నారు.
ఉదయం 9గంటలకే రెండున్నర లక్షల మందికి పైగా సభకు తరలిరావడం గతంలో ఎన్నడూ జరగలేదని, రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదనే సీఎం చెప్పిన మాట చాలా గొప్పదన్నారు. నరేంద్రమోదీ ని కలిసిన తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్టు కనిపించింది. సినిమా నటుడుగా హావభావాలు ప్రదర్షించే పవన్ ఎందుకు పేలవంగా మారారు.. ప్రధానికి ఫిర్యాదు చేసి సింపతీ పొందాలని చూశారు.. రాజకీయ పొత్తుల్లో టీడీపీతోనే శాశ్వతం…. మిగిలిన పార్టీలన్నీ స్టెఫీనీలే.. ఋషికొండలో చిలక గిరింక విహారయాత్ర చేశాయి.. ప్రేమ పావురాలుగా తిరిగితే బాగండదనే ఋషికొండకు వెళ్లాయి. ప్రధాని సభ విజయవంతం అయితే దానిని దారి మల్లించడానికే ఋషికొండకు వెళ్లాయి.. జనసేన రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ.. నాదెండ్ల మనోహరే పవన్ ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.