ఇవాళ సాయంత్రం వైజాగ్ తీరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు.
తొలుత బీచ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్… అనంతరం జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి బయలుదేరారు.అయినా దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. మధ్యలో బౌన్సర్లు ఉండటంతో జనం తాకిడిని ఎలాగోలా తట్టుకున్నారు. చివరికి అతి కష్టం మీద అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.
అలాగే బీచ్ పక్కనే ఉన్న రుషికొండ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. గత కొద్దీ నెలలుగా రుషికొండ ఫై వైస్సార్సీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని , రుషికొండ ను మొత్తం తవ్వేస్తుందని ఆరోపణల నేపథ్యంలో స్వయంగా దానిని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు.
కొంతమంది పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల అవతలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.