టైర్లు ఎందుకు నల్లరంగులోనే ఉంటాయో తెలుసా..ఇందుకోసమే అట..!

-

మనంరోజు చూసే చాలా విషయాల్లో తెలియని అర్థాలు చాలా ఉంటాయి. చిన్నప్పుడైతే మనకు అన్ని సందేహాలే. ఇవి ఇలానే ఎందుకు ఉన్నాయి, వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు మనం మనం అమ్మానాన్నలనో లేదా తాతలనో అడిగి విసిగిస్తాం. ముఖ్యంగా అబ్బాయిలకే ఇలాంటి డౌట్స్ వస్తాయి. కానీ ఆ వయసులో మనకు అన్ని తెలియకపోవచ్చు..ఇప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండే ఉంటాయ్ కదా..అందులో ఒకటి..అసలు అన్ని వాహనాల టైర్లు ఎందుకు నల్లగా ఉంటాయి, రంగురంగలుగా ఎందుకు ఉండవు. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా… అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సైకిలుకు కానీ, కారుకు కానీ, మరే ఇతర వాహనానికైనా ఉండే టైర్లకు కొన్ని ముఖ్యమైన ధర్మాలు ఉండాలి. వాహనం ఎంత వేగంగా వెళుతున్నా టైరులో ఉండే ట్యూబులో గాలి తగ్గిపోకుండా ఉండాలి. రోడ్డుపై పోతున్నప్పుడు కలిగే రాపిడికి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నేటంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బరులో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందుకని టైర్ల తయారీకి మామూలు రబ్బరులో కొన్ని ఇతర పదార్థాలను కలుపుతారు.

రబ్బరులో 35 శాతం ‘బ్యూటజీన్‌’ రబ్బరును కలుపుతారు. ఇది టైర్లకు రాపిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మరో 65 శాతం ‘కార్బన్‌ బ్లాక్‌’ అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రాసెసింగ్‌ ఆయిల్‌, ప్రొడక్షన్‌ వ్యాక్స్‌ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. తాకిడిని తట్టుకునేంత సస్పెన్షన్‌ను ఇస్తుంది. దీని వల్లనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది. టైర్లను కాల్చినపుడు దట్టమైన పొగ రావడానికి కారణం కూడా సరిగా మండని ఈ కర్బన రేణువులే అట. టైర్లలో ఎక్కువగా ఉండే కార్బన్‌బ్లాక్‌ అనేది ఇసుక నుంచి తయారయ్యే నల్లని పదార్థం. దీని వల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు లక్షాయాభైవేల కిలోమీటర్లు నడుస్తాయి.

మొదట తెలుపురంగులోనే ఉండేవట:

1895 లో టైర్లను కనుక్కున్నప్పుడు ఇవి తెలుపు రంగులోనే ఉండేవట. అప్పుడు టైర్లలో జింక్ ఆక్సైడ్ కలపటం వలన అవి తెల్లగా ఉండేవట. అయితే, టైర్లను ఎక్కువ కాలం మన్నేలా చేయడం కోసం, మరియు వాటి దృఢత్వాన్ని మరింత గా పెంచడం కోసం జింక్ ఆక్సైడ్ స్థానంలో కార్బన్ బ్లాకు వాడటం మొదలైంది. అలా టైర్లు నల్లగా మారాయి.

టైర్లను కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించి తయారు చేయడం వలన అవి ఆ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడగలుగుతాయి. ఈ రకమైన రబ్బరు UV కిరణాల నుండి కూడా రక్షణ ఇవ్వగలదట. అయితే, యూవీ కిరణాల వలన టైర్ పని తీరు కొంత దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇదిమానట సంగతి..టైర్లు నల్లగా ఉండటం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎ‌వరైనా అడిగితే ఇప్పుడు టక్కున సమాధానం చెప్పేయండి.

Read more RELATED
Recommended to you

Latest news