దృఢమైన జుట్టు, మందమైన కేశాలు కావాలనుకుంటున్నారా? ఇవి ప్రయత్నించండి.

-

అందంగా కనిపించాలనుకునే ప్రతీ ఒక్కరూ తమ జుట్టు గురించి బాగా ఆలోచిస్తారు. జుట్టు మీ అందాన్ని మరింత పెంచుతుంది. అందుకే మందమైన జుట్టు, దృఢమైన కేశాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జీవన శైలి, తీసుకునే ఆహారాలు కేశాలని దృఢంగా ఉండనివ్వట్లేదు. జుట్టు రాలిపోవడం, ప్రాణం లేనట్టుగా మారిపోవడం, పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలంటే కొన్ని ప్రత్యేక పద్దతులు అవలంభించాల్సి ఉంటుంది.

బయోటిన్ :

శరీరంలో బయోటిన్ లోపం వల్ల జుట్టు రాలిపోయే సమస్య ఏర్పడుతుంది. చుండ్రు, కళ్ళ చుట్టూ చికాకు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు బయోటిన్ లోపం వల్ల కలుగుతాయి. బయోటిన్ అనేది బీ విటమిన్ కి సంబంధించిననది. బీ7 అని పిలుస్తారు. ఇది శరీరంలో తయారవదు. ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. వేరుశనగలు, బాదం, వాల్నట్, పిస్తా, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజల్లో బీ7 అధికంగా లభిస్తుంది. అంతే కాదు బయోటిన్ సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి.

ఆముదం నూనె

ఆముదం నూనె కండీషనర్ గా పనిచేస్తుంది. వారానికి రెండు సార్లు ఆముదం నూనెతో జుట్టుకి మసాజ్ చేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకి మంచి పోషణ అందుతుంది.

గ్రీన్ టీ:

దీనిలో యాంటీ ఆండ్రోజన్ ప్రభావాలు ఉంటాయి. ఆ కారణంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు సంరక్షణ కోసం గ్రీన్ టీని మీ డైట్ లో భాగం చేసుకోండి.

వేడికి దూరంగా ఉండాలి

జుట్టును వేడి చేసే స్ట్రెయిట్నర్లను వాడకుండా ఉండాలి. దీనిలోని వేడి కారణంగా జుట్టు దెబ్బ తింటుంది. దానివల్ల జుట్టు రాలిపోయే సమస్య ఏర్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news