ఆనందయ్య మందుపై రిపోర్ట్ లు ఇంకెప్పుడు..? ఏపీ హైకోర్ట్ కి సర్కార్ ఏం చెప్పింది…?

-

ఆనందయ్య మందుపై హైకోర్ట్ లో నేడు విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్ట్ స్పష్టం చేసింది.

మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ న్యాయవాది కృష్ణయ్య ప్రశ్నించారు. ఆనందయ్య తో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని మరో పిటిషనర్ న్యాయవాది యాలమంజుల బాలాజీ హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ ధాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఆనందయ్య తన మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news