క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగస్.. సర్జరీలో బయటకు తీసిన వైద్యులు.

కరోనా నుండి రికవరీ అయ్యాక అతి పెద్ద ఇబ్బందిగా మారిన సమస్య, బ్లాక్ ఫంగస్. రోజు రోజుకీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్యబృందం ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. బీహార్ రాజధాని పాట్నాలోని ఇంధిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు అనిల్ కుమార్ అనే రోగికి సర్జరీ చేసి క్రికెట్ బంతి సైజులోని బ్లాక్ ఫంగస్ ని బయటకు తీసారు. మెదడులోంచి బయటకు వచ్చిన ఈ బ్లాక్ ఫంగస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కొన్ని రోజుల క్రితం అనిల్ కుమార్ కోవిడ్ నుండి రికవరీ అయ్యాడు. రికవరీ అయినప్పటి నుండి బలహీనత, అలసిపోవడం, తలనొప్పి తదితర ఇబ్బందులతో బాధపడ్డాడు. ఈ లక్షణాలు తీవ్రంగా మారడంతో ఇందిరా గాంధీ మెడికల్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు. అనిల్ కుమార్ ని పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని కనుక్కుని సర్జరీ చేసి క్రికెట్ బంతి సైజులో ఉన్న ఫంగస్ ని బయటకు తీసారు.