కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత అలర్జీ వస్తే ఏం చేయాలి..?

-

భారత్ బయోటెక్ ఏదైనా అలెర్జీలు ఉంటే వ్యాక్సిన్ తీసుకో వద్దని ముందే చెప్పేసింది. అయితే అలర్జీలు ఉన్నవాళ్లు కో వాక్సిన్ తీసుకోవచ్చా..? అయితే డాక్టర్ ప్రత్యేకించి వ్యాక్సిన్ పేరు చెప్పకుండా అలర్జీ ఉన్నవాళ్లు డాక్టర్ ని ముందుగా కన్సల్ట్ చేస్తే మంచిదని చెప్పారు.

AIIMS డాక్టర్ డాక్టర్ రన్ దీప్ వ్యాక్సిన్ అంటే ఎలర్జీ వున్నవాళ్లు వాక్సిన్ వేయించుకున్న తర్వాత మెడికేషన్ ని కంటిన్యూ చేయాలని చెప్పారు. ఒకవేళ కనుక ఎవరికైనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఎలర్జీ వస్తే అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయమని అన్నారు.

కోవాక్సిన్ యొక్క ఏదైనా కాంపోనెంట్స్ వలన అలెర్జీ ఉంటే వాళ్ళు టీకా తీసుకోరాదని కంపెనీ తెలిపింది. 6µg మొత్తం-వైరియన్ నిష్క్రియం చేయబడిన SARS-CoV-2 యాంటిజెన్ (NIV-2020-770), మరియు అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ 250 µg, TLR 7/8 అగోనిస్ట్ (ఇమిడాజోక్వినోలినోన్) 15 µg, 2-ఫినాక్సైథనాల్ 2.5 మి.గ్రా, మరియు ఫాస్ఫేట్ బఫర్ సెలైన్ 0.5 మి.లీ దీనిలో వున్నాయి. వీటికి ఎలర్జీ వుండే వాళ్ళు తీసుకోక పోవడం మంచిది.

కోవిషీల్డ్ విషయానికొస్తే.. టీకా యొక్క మొదటి మోతాదు తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ ని ఇస్తే.. అప్పుడు టీకా తీసుకోకూడదు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన ఫాక్ట్ షీట్లో ఈ విషయం వెల్లడించింది.

ఎల్-హిస్టిడిన్, ఎల్-హిస్టిడిన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్, మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్, పాలిసోర్బేట్ 80, ఇథనాల్, సుక్రోజ్, సోడియం క్లోరైడ్, డిసోడియం ఎడిటేట్ డైహైడ్రేట్ (ఇడిటిఎ) వంటి వాటికీ అలెర్జీ ఉంటే వాళ్ళు తీసుకోకపోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news