కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు సైంటిస్టులు శ్రమిస్తున్నారు. ఫార్మా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నాయి. ఇక కోవిడ్ బారిన పడిన వారికి హాస్పిటళ్లలో పలు రకాల మెడిసిన్లతో చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా రాకుండా ఉండేందుకు గాను శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం తులసి, అల్లం, లవంగాలు.. తదితర వంట ఇంటి పదార్ధాలను జనాలు నిత్యం తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ వైరస్‌కు కొబ్బరి నూనె చెక్ పెడుతుందంటూ ప్రస్తుతం వైద్య నిపుణులు, సైంటిస్టుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో చాలా సులభంగా కలిసిపోతుంది. భారతీయులు ఎన్నో సంవత్సరాల నుంచి కొబ్బరినూనెను వాడుతున్నారు. ముఖ్యంగా కేరళ వాసులు ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్లే అక్కడ కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, కరోనా బారిన పడ్డవారు కూడా చాలా త్వరగా కోలుకుంటున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక కరోనాపై పోరాటం చేయడంలో కొబ్బరినూనె ఎంత వరకు ఉపయోగపడుతుంది.. అనే విషయమై పలువురు వైద్య నిపుణులు బృందంగా ఏర్పడి సమీక్షిస్తున్నారు.
అయితే కోవిడ్ పేషెంట్లకు ప్రస్తుతం ఇస్తున్న విటమిన్ ట్యాబ్లెట్లలో జింక్ ముఖ్యంగా ఉంటోంది. ఇది కోవిడ్ పేషెంట్లలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక కొబ్బరినూనెలో జింక్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆ నూనె యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల సూక్ష్మక్రిములపై కొబ్బరినూనె సమర్థవంతంగా పోరాడుతుందని పలువురు పేర్కొంటున్నారు. కనుకనే కోవిడ్ పేషెంట్లు కొబ్బరినూనె వాడొచ్చా, లేదా.. అన్న అంశంపై నిపుణులు ప్రస్తుతం అధ్యయనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి నిపుణులు ఈ విషయంపై చివరకు ఏం తేలుస్తారో చూడాలి.