ఆడవారు బయటకు వస్తే.. లిప్‌స్టిక్ వేసుకోకుండా ఉండరు. అది వారిలో ఒక భాగం అయిపోయింది.. ఒక్కోక్కరు ఒక్కో రకమైన లిప్‌స్టిక్ వాడతారు.. కొందరు కాస్ట్లీవి వాడితే.. మరికొందరు కోఠీ, బీసెంట్ రోడ్లో 30, 40 రూపాయలకు వచ్చేవి వాడతారు. అవి మరీ డేండర్..! అసలు లిప్‌స్టిక్ వాడడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా అమ్మాయిలు..!
లిప్‌స్టిక్‌లో కాడ్మియం, అల్యూమినియం, క్రోమియం, సీసం వంటి అనేక రసాయనాలు ఉంటాయి. ఇది పెదాల అందాన్ని పాడు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని సీసం మీ రక్తపోటును పెంచుతుంది. లీడ్ కంటెంట్ చాలా హానికరం. ఇది గుండె సమస్యలకు దారితీస్తుందట.. కాబట్టి లిప్ స్టిక్ ఎక్కువగా వాడటం మంచిది కాదు.
లిప్‌స్టిక్‌లోని రసాయన మూలకాలు చర్మ సమస్యలను కలిగిస్తాయి. దీని వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, వీలైనంత వరకు లిప్‌స్టిక్‌ను ఉపయోగించుకోకపోడమే ఉత్తమం. ముఖ్యంగా గర్భిణీలకు లిప్ స్టిక్ హానికరమని వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో సహా ఇతర మహిళల సమస్యలకు ఇది ప్రధాన కారణం అవుతుందట..
లిప్‌స్టిక్‌ను కొనేప్పుడు ఇవి చూడండి…
లిప్‌స్టిక్‌లో ఉండే పాలిథిలిన్ మీ నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. కాబట్టి లిప్ స్టిక్ కొనేటపుడు అందులో పాలిథిలిన్ ఎంత ఉందో గమనించండి. అందులో పాలిథిలిన్ ఎక్కువగా ఉంటే కొనకండి.
కొన్నిసార్లు లిప్‌స్టిక్‌లు మన శరీరంలోకి చేరుతాయి. ఆహారం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు ఇది సాధారణం. కానీ ఇందులోని పారాబెన్ డయేరియాకు కారణమవుతుందని రుజువైంది.
కొన్ని లిప్‌స్టిక్‌లు చర్మం చికాకు, గురక, దగ్గు, కంటి చికాకు కలిగిస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే ఆ లిప్ స్టిక్ ఉపయోగించకపోవడమే మంచిది.
చాలామంది లిప్‌స్టిక్, ఐలైనర్, కాజల్ వంటివి తక్కువ ధరకు వచ్చేవి వాడేస్తారు..మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. 50 వందల్లో వచ్చేవి కొని.. కోట్ల విలువైన మీ కళ్లు, పెదాలకు అప్లై చేస్తారా..? ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు.. వీలైనంత వరకూ మంచివే తీసుకుని అవసరం కొద్ది మాత్రమే..వాడేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు..