డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ వచ్చేస్తోంది… ‘ ట్రూత్ సోషల్’ పేరుతో కొత్త యాప్

-

మాజీ అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ను ప్రారంభిస్తున్నారు. ‘‘ ట్రూత్ సోషల్’’ పేరుతో సరికొత్త సోషల్ మీడియా యాప్ పు ప్రారంభిస్తున్నారు. ఈ వారం నుంచే … ట్రూత్ సోషల్ రానుంది. అయితే మార్చి చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ వారం ఆపిల్ యాప్ స్టోర్ లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఈ యాప్ ను డెవలప్ చేసింది. ‘ట్రూత్ సోషల్’ యాప్ ను ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూపొందించింది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ లకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. 

గతంలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తరువాత ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ పై దాడి చేశారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను ట్విట్టర్, ఫేస్ బుక్ నిషేధించాయి. దీంతో ట్రంప్ సొంతంగా తానే ఓ కొత్త సోషల్ మీడియా ఫ్లాట ఫారమ్ ఏర్పాటు చేస్తానని గతంలోనే ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ‘ ట్రూత్ సోషల్’ రాబోతోంది. ట్రంప్ తీసుకువస్తున్న కొత్త యాప్ తో ఫేస్ బుక్, ట్విట్టర్లకు దెబ్బపడే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news