రక్తదానం చేస్తే ఈ అనారోగ్య సమస్యలు రావు..!

-

రక్తదానం (Blood Donation)  చేస్తే కేవలం ఒక మనిషి ప్రాణాలను మాత్రమే కాపాడతాం అనుకుంటే పొరపాటు. రక్త దానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా రక్తదానం ఉపయోగపడుతుంది. మరి వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.

రక్తదానం | Blood Donation

బరువు తగ్గొచ్చు:

రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి సహాయ పడుతుంది. 450 మిల్లీలీటర్లు రక్తదానం చేయడం వల్ల 650 కేలరీలు కరిగిపోతాయట.

క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది:

రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. అది ఎలా అంటే..? ఎక్కువ ఐరన్ ఒంట్లో ఉండటం వల్ల అది క్యాన్సర్ కి కారణం అవుతుంది. రక్తదానం చేసే క్రమంలో ఐరన్ శాతం కూడా తగ్గుతుంది. దీనితో క్యాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది.

కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి:

రక్త దానం చేయడం వల్ల పాత రెడ్ బ్లడ్ సెల్స్ కొత్త బ్లడ్ సెల్స్ తో రీప్లేస్ అవుతాయి. ఈ ప్రాసెస్ 30 నుండి 60 రోజుల పాటు జరుగుతుంది.

హృదయ సంబంధిత సమస్యలు ఉండవు:

రక్త దానం చేయడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉండవని డాక్టర్లు చెబుతున్నారు రక్తదానం చేయడం వల్ల మనలో ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి అని.. దీని ద్వారా హృదయ సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుందని చెప్పారు.

చూసారా రక్త దానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. కేవలం ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడం మాత్రమే కాకుండా ఈ ప్రయోజనాలు కూడా దాతలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news