డెలివరీ అయ్యాక వీటిని పొరపాటున కూడా తీసుకోవద్దు..!

-

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి అలానే డెలివరీ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ తర్వాత కూడా గర్భిణీలు వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ సమయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో అలానే డెలివరీ తర్వాత కూడా జాగ్రత్త వహించాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ఆహార పదార్థాలకు గర్భిణీలు దూరంగా ఉంటే మంచిది.

షుగర్ ఉండే డ్రింక్స్:

డెలివరీ అయిపోయాక షుగర్ ఉండే డ్రింక్స్ ని తీసుకోకూడదు. చక్కెర పానీయాలని ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగిపోతారు. అలానే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

కాఫీ:

డెలివరీ అయిన తర్వాత కూడా కాఫీ ఎక్కువ తీసుకోకూడదు కాఫీ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. కాఫీ లో వుండే కెఫిన్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత కాఫీ కి దూరంగా ఉండటం మంచిది.

జంక్ ఫుడ్:

డెలివరీ అయిన తర్వాత జంక్ ఫుడ్ తీసుకోకూడదు. గర్భిణీలు కూడా వీటికి దూరంగా ఉండాలి.

బ్రోకలీ:

బీన్స్, బ్రోకలీ వంటి వాటిని ఎక్కువ తీసుకోకూడదు వీటి వలన గ్యాస్ సమస్య కలుగుతుంది. ఆహారం జీర్ణం కాదు. కాబట్టి డెలివరీ అయిన తర్వాత వీటిని కూడా తీసుకోవద్దు.

చాక్లెట్స్:

డెలివరీ అయిన తర్వాత చాక్లెట్లు ని కూడా తీసుకోకూడదు పాలిచ్చే తల్లులు చాక్లెట్స్ ని తీసుకుంటే రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాలి.

కారంగా ఉండే ఆహార పదార్థాలు:

స్పైసి ఫుడ్ ని తీసుకోవద్దు వీటివలన కడుపులో మంట కలుగుతుంది అలానే గుండెలో మంట కూడా వస్తుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్ ని కూడా డెలివరీ అయిన తర్వాత తీసుకోకూడదు పాలిచ్చే తల్లులపై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news