TSPSC చైర్మన్ ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడు? – ఇంద్రసేనారెడ్డి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని.. ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు వేసుకున్నదేనన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి. టీఎస్పీఎస్సీ కమిటీ కి నోటీసులు అనే వార్త ప్రజలను ఫూల్స్ చేసేదేనన్నారు. రాష్ట్రంలో వేసిన సిట్ లపై మాకసలు నమ్మకమే లేదన్నారు. సిట్ వేశారు అంటే ఆ కేసును పర్మనెంట్ గా పెండింగ్ లో పెట్టడమేనని ఎద్దేవా చేశారు.

ఇప్పటి వరకు వేసిన ఏ సిట్ కూడా పూర్తి స్థాయి లో పనిచేయలేదన్నారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ… కానీ ఆ సంస్థ చైర్మన్ ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. తీగలాగితే తన డొంక బయటపడుతుంది అనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని అన్నారు ఇంద్రసేనారెడ్డి. సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లే అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్ కు కూడా ఉండదన్నారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో మెంబర్ సెక్రటరీ కి తప్ప ఎవరికీ తెలియదని.. టీఎస్పీఎస్సీని చెప్పుచేతల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా పనిచేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

సీల్డ్ కవర్ లో తెస్తే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది.. కంప్యూటర్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పేపర్ లు టీఎస్పీఎస్సీ కి ఆన్లైన్ లో, సీల్డ్ కవర్, వాట్సాప్ లో తెప్పించారా.. ఎలా తెప్పించారని ప్రశ్నించారు ఇంద్రసేనారెడ్డి. టీఎస్పీఎస్సీ లో సెక్యూరిటీ విధానాలు పాటించారా? లేదా? అని నిలదీశారు. సీక్రెట్ రూంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవా?…ఉంటే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ అంశం పై రాష్ట్రపతి కి లేఖ రాయాలన్నారు. టిఎస్పిఎస్సి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి కెసిఆర్ ఇలాంటి పనులు చేస్తున్నాడని ఆరోపించారు ఇంద్రసేనారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news