మీ పిల్లలకి ఆస్తి అప్పచెప్పే ముందు వీటిని అస్సలు మరచిపోకండి..!

-

తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు పంచేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలని గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయాలని కనుక తల్లిదండ్రులు ఆస్తులను పంచేటప్పుడు గుర్తు పెట్టుకుంటే ఏ ఇబ్బంది వాళ్లకి రాదు. ఆచారి చాణక్య మన జీవితంలో కలిగే ప్రతి సమస్యని కూడా మంచిగా పరిష్కరించుకునే విధంగా చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పినట్లు మనం అనుసరిస్తే జీవితంలో ఏ బాధ ఉండదు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

జీవితానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలని ఆచార్య చాణక్య చర్చించారు ఒకవేళ కనుక ఎవరైనా వ్యక్తి తన సంపదని ఎవరికైనా అప్ప చెప్పాలనుకుంటే ఈ ప్రాథమిక నియమాలు అతను గుర్తు పెట్టుకోవాలని చాణక్య అన్నారు.

ప్రపంచం లో ప్రేమకు డబ్బు శత్రువు వంటిది అని చాణక్య చెప్పారు. చాలా మంది డబ్బు వ్యామోహం వలన సన్నిహితుల్ని మర్చిపోతూ ఉంటారు పిల్లలు కి తల్లిదండ్రులు అసలు ఆలోచించకుండా వాళ్ల డబ్బును అప్పగిస్తే తల్లిదండ్రులని గౌరవించడం మానేస్తారని అన్నారు. మీ పిల్లలకి మీ ఆస్తిని అప్పగించేటప్పుడు చాలా సార్లు ఆలోచించాలని ఆయన చెప్పారు.

డబ్బు మీకు మీ పిల్లలకి మధ్య అనుబంధాన్ని అంతం చేస్తుంది కాబట్టి మీ పిల్లలకి మీ ఆస్తిని అప్పగించేటప్పుడు ఆలోచించండి. అలాగే మీ పిల్లలు మీ ఆస్తిని ప్రేమిస్తున్నారా లేక మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు జీవించి ఉన్నప్పుడు మీ ఆస్తులు అన్ని కూడా మీ పిల్లలకి అప్పగించొద్దు మీ మీద ప్రేమ తగ్గిపోవడమే కాకుండా వాళ్ళు దానిని దుర్వినియోగం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news