డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమా అడ్డా లోడింగ్.. ప్రోమో వైరల్..!

-

తాజాగా ఈటీవీలో ప్రతి శనివారం రాత్రి 9:30 గంటలకు సుమా హోస్టుగా చేస్తున్న “సుమ అడ్డా” కార్యక్రమం జనవరి ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి సంతోష్ శోభన్ తాను నటించిన “కళ్యాణం కమనీయం” సినిమా టీం తో వచ్చి సందడి చేయగా.. ఇప్పుడు వచ్చే ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ డైరెక్టర్ బాబీతో వచ్చి సందడి చేయనున్నారు. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా ప్రసారం చేయబోతున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక ప్రోమో ఒకటి తాజాగా విడుదల చేయడం జరిగింది.

ప్రోమోలో ఆద్యంతం చిరంజీవి నవ్వుల పువ్వులు పూయించారు.. ఈ రేఖలలో మీరు ఏ రేఖకు భయపడతారు అనగా తన భార్య సురేఖ పేరు చెప్పి అందరిని నవ్వించారు. ఆ తర్వాత చూడాలని ఉంది సినిమాలోని చిరంజీవి మళ్లీ ఇప్పుడు నటిస్తారు అని, అంజన జవేరి స్థానంలో సుమా ఉంటానని చెప్పగా.. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అంటూ ఆయన మరొకసారి సెటైర్లు వేసి పంచుల వర్షం కురిపించారు. అంతేకాదు సుమను కొద్దిసేపు తన భార్య సురేఖ లాగా యాక్ట్ చేయాలని కూడా తెలిపారు. అలా ఆద్యంతం ఈ షో లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఇక చివర్లో చిరంజీవి..డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమా అడ్డా లోడింగ్..అంటూ చిరంజీవి చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.

ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే సుమ.. మరొకపక్క జోష్ తో సెటైర్ల , పంచ్ ల వర్షం కురిపించిన చిరంజీవి.. ఇద్దరు కలిసి ఈ షో కి మరింత కొత్త రంగులు తీసుకొచ్చారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇకపోతే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఈ షోకి వచ్చినట్లు తెలుస్తోంది మొత్తానికైతే ఈ షో జనవరి 14 శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news