2023-24 బడ్జెట్‌లో అయినా నిధులు ఇవ్వాలి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

-

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం ఇప్పటివరకు అదనంగా రూపాయి కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌లో నిరాశే ఎదురవుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సారి బడ్జెట్‌లో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని.. లేదంటే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలతో పాటు తెలంగాణ పురపాలక విజయాలను ప్రత్యేకంగా లేఖలో పేర్కొన్నారు.

“కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపినా పురపాలక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి ఇటీవల వచ్చిన పురపాలక అవార్డులను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గుర్తిస్తుందన్న ఆశాభావంతో లేఖ రాస్తున్నా.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news