మధ్యాహ్నం తినే లంచ్ కంటే.. మార్నింగ్ తినే టిఫెన్ చాలా ముఖ్యమైనది.. కానీ చాలామంది.. టిఫెన్ స్కిప్ చేసి డైరెక్టుగా లంచ్ తింటారు. దీనివల్ల ఎక్కువగా తినడం, లేట్‌గా తినటం వల్ల గ్యాస్ ఫామ్ అవడం జరుగుతుంది. బరువు పెరగకూడదు., ఆరోగ్యంగా హెల్తీ డైట్ మెయింటేన్ చేయాలంటే.. కచ్చితంగా టిఫెన్ చేయాల్సిందే.. టిఫెన్ అంటే ఎప్పుడూ తినే ఇడ్లీ, వడ, ఉప్మా, దోశలే కాకుండా.. చాలా వెరైటీస్ ఉన్నాయి.. పెరుగుతో కమ్మగా దోశ చేసుకోవచ్చు తెలుసా..? దీని రుచి అమోఘం. ఈ పెరుగు దోశను అటుకులతో కలిపి చేస్తారు, కాబట్టి దీనిని అటుకుల దోశ, పోహ దోశ అని కూడా పిలుస్తారు. మరీ ఈ దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో చూద్దామా..
పెరుగు దోశకు కోసం కావలసినవి..
1 కప్పు ఇడ్లీ బియ్యం లేదా సోనా మసూరి రైస్
అరకప్పు మందపాటి అటుకులు
రెండు టేబుల్ స్పూన్లు మినప పప్పు
అరకప్పు పెరుగు,
1 కప్పు నీరు
పావుటీస్పూన్ బేకింగ్ సోడా
అరటీస్పూన్ ఉప్పు
దోశలు కాల్చటానికి సరిపడా నూనె
పెరుగు దోశ తయారీ విధానం..
ముందుగా పెరుగును తీసుకొని మజ్జిగ చేసుకోవాలి, మరోవైపు అటుకులు, బియ్యం, మినప పప్పును రెండు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి.
మజ్జిగలో అటుకులు, బియ్యం, మినప పప్పును 2-3 గంటల పాటు నానబెట్టండి. ఆపై గ్రైండర్‌లో వేసి అవసరం మేరకు నీళ్లు పోసుకొని మెత్తని బ్యాటర్ చేసుకోండి. ఈ పిండి బ్యాటర్‌లో బేకింగ్ సోడా, ఉప్పు వేసి 4- 5 గంటలు పులియబెట్టండి. అనంతరం పాన్ వేడి చేసి, పులియబెట్టిన పిండితో దోశలు చేసుకోండి. పెరుగు దోశలు రెడీ.. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మార్నింగ్ మాత్రమే కాదు.. ఈవినింగ్ స్నాక్స్‌గా, జర్నీలో చిరుతిండిగా కూడా తినేయొచ్చు..! ఈ సారి టిఫెన్ ఇలా ప్లాన్ చేయండి. కమ్మగా ఉంటాయి.. కడుపునిండా తినొచ్చు..!!