ప్రపంచంలో ఏ వాక్సిన్ కూడా ఆ వేరియంట్ ని చంపలేదు: సీనియర్ డాక్టర్ సంచలన ప్రకటన

కోవిడ్ -19 కోసం తయారు చేసిన ఏ వాక్సిన్ కూడా దక్షిణాఫ్రికాలో కనిపించే వేరియంట్‌ ను చంపలేవు అని ఒక సంచలన ప్రకటన చేసారు డాక్టర్ శంకర్ చెట్టి. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎడ్వర్డ్ లో ఉండే ఆయన ఈ ప్రకటన చేసారు. దక్షిణాఫ్రికా అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయం బయట పెట్టారు. అందుకే తమ దేశంలో టీకా డ్రైవ్ చాలా స్లో గా ఉందని ఆయన చెప్పారు.

దక్షిణాఫ్రికాలో కోవిడ్ -19 యొక్క మొదటి వేవ్ గురించి మాట్లాడుతూ, అప్పటి ప్రభుత్వం చాలా కఠినమైన లాక్డౌన్ విధించిందని అన్నారు. నల్లజాతి జనాభాలో ఎక్కువ శాతం మంద రోగనిరోధక శక్తిని కరోనా సోకిన తరువాత పెంచుకున్నారని తాము గుర్తించినట్టు చెప్పారు. వైరస్ ఉత్పరివర్తన చాలా భిన్నంగా ఉందని ఆయన గుర్తించినట్టు చెప్పారు.