దేశాన్ని అత్యంత సురక్షితంగా ఉంచేందుకు… ఢిపెన్స్ రిసెర్చ్ అండ్ డెవలమప్మెంట్ ఆర్గనైజేషన్( డీఆర్డీఓ) ఎన్నో ఆవిష్కరణలు చేస్తోంది. మన దేశానికి కావాల్సిన అత్యాధునిక ఆయుధాలను, క్షిపణుల తయారీలో ముందుంది. భారత దేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చడంతో పాటు రక్షణ సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడకుండా మన రక్షణ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఎంతో సహాయపడుతోంది. ఆయుధాల సాంకేతిక కార్యక్రమాలు, క్షిపణులు, తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు మొదలైనవి ఇప్పటికే ఇటువంటి ముఖ్యమైన అభివృద్ధిని సాధించింది. 1958లో ప్రారంభం అయిన ఈ సంస్థ దేశ రక్షణ విభాగానికి కీలకంగా వ్యవహరిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది డీఆర్డీఓ. కేవలం 45 రోజుల్లోనే 7 అంతస్థుల భవనాన్ని నిర్మించింది. దీన్ని బెంగళూర్ లో నిర్మించిన ఈ భవనాన్ని ఐదవ తరం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) స్వదేశీ అభివృద్ధికి, రిసెర్చ్ అండ్ డెవలప్ కోసం ఉపయోగించనున్నారు. తాజాగా ఈరోజు ఈ భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. AMCA కోసం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం ఏవియోనిక్స్ అభివృద్ధి కోసం ఉపయోగించబడుతుంది.