హిజాబ్ విషయం లో స్కూల్లో అందరూ యూనిఫామ్ ని ధరించాల్సిందేనని.. హిందు ధార్మిక సంస్థల పై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని పేర్కొన్నారు rss రాష్ట్ర కార్యదర్శి కాచం రమేష్. దేశ వ్యాప్తంగా సంఘ శాఖలు విస్తృతంగా పెరుగుతున్నాయని.. Rss పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. 60 వేల 929 శాఖలు దేశం లో జరుగుతున్నాయని… వారానికి ఒకసారి జరిగే శాఖలు 20 వెల 681 అన్నారు.
తెలంగాణ లో కొత్తగా 175 గ్రామాలకు rss ఈ ఏడాది వెళ్ళింది… 311 శాఖలు కొత్తగా ప్రారంభించడం జరిగిందని… శాఖలకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా కొత్తగా లక్ష 25 వేలు rss లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. తెలంగాణ లో ఒక్క ఫిబ్రవరి లోనే 8 వందలకు పైగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ లో ప్రతి 5 గ్రామాలకు సరాసరి ఒక గ్రామం లో సంఘ శాఖ ప్రారంభించాలనేది లక్ష్యమని… పట్టణ ప్రాంతాల్లో 10 వేల జనాభాకు ఒక శాఖ నడిపించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ లో 13 గ్రామాలలో సర్వాంఘిన ఉన్నతికి rss కృషి అని.. మరో 40 గ్రామాల్లో గ్రామ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.