పాలు తాగితే బరువు పెరుగుతామని విని ఉంటారు. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలతో ఈజీగా బరువు పెరుగుతాము. రోజూ గ్లాసెడు పాలు తాగితే ఎముకలు బలంగా మారుతాయి. అందుకే ఎక్కువ శాతం ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే పాలను ప్రీఫర్ చేస్తారు. అయితే కొందరికి పాలు పేరు చెప్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ముక్కు మూయించి మరీ పాలు తాగించే పరిస్థితి ఉంటుంది. అయితే పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి వయోవృద్ధుల వరకూ పాలు తాగాలని సూచిస్తున్నారు.
పాలు తాగడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల దొరుకుతాయి. పాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు మన శరీరానికి ఎంతో అవసరం. పాలను రోజూవారీ ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. పాలలో హైక్వాలిటీ ప్రోటీన్లతోపాటు విటమిన్-డీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. దంతాలు, ఎముకలు ధృడంగా చేస్తుంది. దీంతోపాటు బరువు కూడా తగ్గవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
పాలను తాగిన తర్వాత పొట్ట నిండిన అనుభూతి కలుగుతుందని, తద్వారా మీరు ఎలాంటి ఆహారం తీసుకోరని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. పాలు, అరటిపండుతో మిల్క్ షేక్ చేసుకుని తాగితే మంచి ప్రయోజనం పొందుతారు. పాలలో ఉండే పొటాషియం, రక్త నాళాల్లో రక్త ప్రసరణను క్రమబద్దీకరించడం వల్ల గుండె సంబంధిత జబ్బులు దరిచేరవు. చాలా మంది పిల్లలు ఊబకాయానికి గురవ్వడానికి కారణం.. పాలను సరిగ్గా తీసుకోకపోవడమేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కప్పు పాలతో ఒకటి లేదా రెండు అరటి పండ్లను వేసుకుని రోజూ పరిగడపున తీసుకోవాలి. వీటితోపాటు 5 బాదం పప్పులను కూడా తీసుకోవడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తాయి. గర్భిణులు ఎంత పాలు తాగితే అంత శక్తి చేకూరుతుంది.