న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్‌చల్ చేశారు.
ఇటూ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విపరీతంగా జరిగాయి. నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 1,300 మందిపై కేసులు నమోదు చేశారు. పలువురు వ్యక్తులకు 500 పాయింట్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్టు కూడా ఈ టెస్టుల్లో తేలింది. ఈ డ్రైవ్‌లో ఓ వ్యక్తి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకా అని హల్ చల్ చేశాడు.
న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రంక్ డ్రైవ్ టెస్టుల్లో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు pic.twitter.com/tEYpJeluJq
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2025