బ్రేకింగ్ : హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం

హైద‌రాబాద్‌ మహా నగరం లో మరో సారి డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం చేసుకున్నారు. 3 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా కు చేసిన పార్సిల్ లో 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ కొరియర్ కార్యాలయంలో 3 కిలోల డ్రగ్స్ ను పార్సిల్ చేసిన వ్యక్తి.. పక్కా సమాచారం మేరకు కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు ఎన్సీబీ అధికారులు.

ఈ నేపథ్యం లో నే చెన్నై కు చెందిన వ్యక్తి పార్శిల్ చేసినట్లు గుర్తించారు ఎన్సీబీ అధికారులు. కొరియర్ కార్యాలయం లో సమర్పించిన గుర్తింపు కార్డుల ఆధారంగా చెన్నై వెళ్లారు ఎన్సీబీ అధికారులు. సదరు చిరునామాలో వెతికినా నిందితుడు దొరకలేదు.

నకిలీ గుర్తింపు కార్డులు నిందితుడు సమర్పించిన నేపథ్యం లో ఈ సమస్య ను ఎన్సీబీ అధికారులు ఎదురుకున్నారు. రెండు రోజుల పాటు చెన్నై లో వెతికి నిందితుడిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. విశాఖ పట్నం లో ఒక్కరినీ హైదరాబాద్ లో ముగ్గురు బిహారీ లను అదుపు లోకి తీసుకున్నారు ఎన్సీబీ అధికారులు. దీనిపై కేసు బుక్ చేసిన ఎన్సీబీ అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు.