డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి గుడ్ న్యూస్… ఫైన్ తగ్గింపు

-

వీకెండ్ వచ్చిందంటే.. చాలు చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్లపై దొరికిపోతుంటారు. ఇది వీకేండ్ కే పరిమితం కాకుండా సాధారణ రోజుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వల్ల ప్రమాదాాలు జరుగుతున్నాయి. తాగి వాహనాలు నడపడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఎంతగా… అవగాహన కల్పించి, భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు.

ఇదిలా ఉంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికిన వారికి శుభవార్త చెప్పింది కోర్ట్ . హైదరాబాద్ నగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి ఇది వరకు ఉన్న రూ. 10 వేల జరిమానాను రూ. 2 వేలకు తగ్గిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించేందుకు కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం మార్చి 11 వరకు ఉండటంతో చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి డబ్బు చెల్లిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో సుమారు 70 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news