కామారెడ్డిలో రైతుల ఆందోళనలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

-

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన కొనసాగుతుంది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని.. కానీ కొందరు పోలీసులు రెచ్చగొట్టేలా చేస్తున్నారని అన్నారు. కొన్ని పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ అనడం సరైంది కాదన్నారు. భాజపా నేతలు రెచ్చగొడుతున్నారని అనడం దౌర్భాగ్యం అన్నారు రఘునందన్ రావు. పార్టీల జెండాలు పక్కన పెట్టి రైతు ఎజెండాగా వచ్చామన్నారు.

మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మారుస్తాని, చనిపోయిన రైతుకు పరిహారం, ఉద్యోగం అని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేగానీ ఇతరులపై నెపం నెట్టే ప్రయత్నం చెయ్యడం దురదృష్టకరం అన్నారు. కలెక్టర్ వచ్చి వినతి పత్రం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. రైతుల సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు కామారెడ్డి పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు రఘునందన్ రావు. కలెక్టర్ వచ్చి వినతి పత్రం తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news