Breaking : బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌

-

ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో దాదాపు 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది.

దురంతో ఎక్స్‌ప్రెస్‌ వస్తుండటంతో భీమడోలు జంక్షన్‌ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో గేదెల దొంగతనానికి బొలెరో వాహనంలో వెళ్లిన కొందరు దుండగులు పోలీసులను చూసి పారియేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టగా.. ఆ వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ సమీపించడంతో సదరు వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. రైలు ఇంజిన్‌ దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ అమర్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దురంతోని ప్రయాణికులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయల్దేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news